స్టెప్పులేసి అదరగొట్టిన సితార

by సూర్య | Tue, Aug 13, 2019, 07:51 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు గారలపట్టి సితార గురించి అందరికీ తెలిసిందే. తండ్రితో కలిసి చలాకీగా తిరుగుతుండే ఈ చిన్నారికి సంబంధించిన ముఖ్య అప్‌డేట్స్‌ను ప్రిన్స్, నమత్ర ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ య్యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించి చిన్నారులను ఆకట్టుకునేల  ప్రోగ్రామ్స్ కూడా చేస్తోంది. 
సితార తాజాగా తన  డ్యాన్స్‌తో అందరి  దృష్టిని తన వైపు తిప్పుకుంది. ‘మహర్షి’ సినిమాలోని ‘పాలపిట్ట’ సాంగ్‌కు స్టెప్పులేసింది. దీన్ని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. చాలా క్యూట్‌గా డ్యాన్స్ చేశావంటూ అంతా అభినందిస్తు న్నారు. కాగా ఇంతకు ముందు కూడా బాహుబలి సినిమాలోని ‘కన్నా నిదురించరా’ పాటకు ఆమె డ్యాన్స్ చేసింది. తన టాలెంట్‌ను  అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM