'అలప్పుజా జింఖానా' ప్రీమియర్ షోస్ కి భారీ రెస్పాన్స్

by సూర్య | Thu, Apr 24, 2025, 07:11 PM

ప్రేమలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో ప్రజాదరణ పొందిన తరువాత నటుడు నాస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన 'అలప్పుజా జింఖానా' మొదట ఏప్రిల్ 10, 2025న మలయాళంలో విడుదల చేశారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకి ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పుడు ఏప్రిల్ 25, 2025న తెలుగు విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ సినిమా గ్రాండ్ స్పెషల్ ప్రీమియర్ షోస్ ఈరోజు రాత్రి 7:20 గంటలకి AMB సినిమాస్ మరియు 8 గంటలకి PVR నెక్సస్ మాల్ లో అమ్ముడయినట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు మేకర్స్ కొన్ని ఎక్స్ట్రా షోస్ ని యాడ్ చేసినట్లు ప్రాకటించారు. ఈరోజు రాత్రి 10:20 గంటలకి బాలానగర్ లోని మైత్రి విమల్ థియేటర్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో లుక్మన్ అవరాన్, గణపతి ఎస్., సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్లాన్ బి మోషన్ పిక్చర్స్ మరియు రీలిస్టిక్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సంగీతాన్ని విష్ణు విజయ్ స్వరపరిచారు.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM