'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా?

by సూర్య | Thu, Apr 17, 2025, 06:50 PM

విగ్నేష్ శివన్ యొక్క రాబోయే తమిళ చిత్రం లైక్ - లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాని మేకర్స్ అక్టోబర్ 31, 2025న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజులలో చిత్ర బృందం అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ చిత్రంలో ప్రదీప్ కి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. ఎస్జె సూర్య మరియు గౌరి కిషన్‌ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని అనిరుధ రవిచాండర్ చేత స్కోర్ చేశారు. నయనతార యొక్క రౌడీ పిక్చర్స్ సహకారంతో లలిత్ కుమార్ యొక్క సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ గా రవి వర్మన్ ఉన్నారు.

Latest News
 
"తెలంగాణలో అఖండ 2 టికెట్ ప్రైస్ బూస్ట్! కొత్త రేట్లు బయటకు!" Thu, Dec 04, 2025, 07:59 PM
సినిమాలు వదిలి స్కూల్‌కు వెళ్తున్న స్టార్ హీరోయిన్ Thu, Dec 04, 2025, 07:39 PM
ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ Thu, Dec 04, 2025, 04:14 PM
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈషా చూడొద్దు: బన్నీ వాసు Thu, Dec 04, 2025, 03:27 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 3 గంటల15 నిమిషాలు! Thu, Dec 04, 2025, 03:16 PM