'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్

by సూర్య | Thu, Apr 17, 2025, 06:42 PM

ప్రముఖ నటుడు  ప్రియదర్శి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి 'సారంగపాణి జాతకం' అనే హాస్య నాటకం కోసం జత కట్టారు. ఈ చిత్రంలో రూప కొడువాయూర్ మహిళా ప్రధాన పాత్రను పోషించారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ఇండియా లో ట్రేండింగ్ 3 పోసిషన్ లో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 'జెంటిల్‌మన్‌', 'సమ్మోహనం' తర్వాత ఇంద్రగంటి, ప్రసాద్‌ల కలయికలో వస్తున్న మూడో చిత్రంగా నిలిచింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ వికె, తనికెళ్ల భరణి మరియు శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చగా, పిజి విందా ఫోటోగ్రఫీ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. 


 

Latest News
 
బాలీవుడ్ లో విషాదం, నటి కామినీ కౌశల్ మృతి Fri, Nov 14, 2025, 04:25 PM
'దేవగుడి' మూవీ టీజర్ విడుదల Fri, Nov 14, 2025, 04:22 PM
‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’ Fri, Nov 14, 2025, 04:21 PM
విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న లిజోమోల్‌ జోస్‌ Fri, Nov 14, 2025, 04:19 PM
షారుక్‌ఖాన్‌ తో బుచ్చిబాబు సినిమా చేయనున్నాడా? Fri, Nov 14, 2025, 04:18 PM