విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు

by సూర్య | Mon, Mar 24, 2025, 08:13 PM

దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాపై మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్‌ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ‘విజయ్‌ 69’, ‘దళపతి 69’ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, బాబీ డియోల్, ప్రియమణి, మమితా బైజు, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా తర్వాత అతడు పూర్తిస్థాయిలో తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ అతడు పోటీ చేయనున్నాడు. ఈ జన నాయగన్ మూవీలో దళపతి విజయ్ తోపాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, మోనిషా బ్లెస్సీలాంటి వాళ్లు నటిస్తున్నారు.

Latest News
 
భారీ మొత్తానికి అమ్ముడయినా 'జన నాయగన్' థియేట్రికల్ హక్కులు Tue, Apr 22, 2025, 06:54 PM
'పెద్ది' పై బుచి బాబు సనా కీలక వ్యాఖ్యలు Tue, Apr 22, 2025, 05:38 PM
'RAPO22' ఫస్ట్ సింగల్ విడుదలపై లేటెస్ట్ బజ్ Tue, Apr 22, 2025, 05:28 PM
ఒక ట్విస్ట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న 'హరి హర వీర మల్లు' Tue, Apr 22, 2025, 05:04 PM
రెసిల్ మానియాపై మొదటి భారతీయ సెలబ్రిటీ గా టాలీవుడ్ హల్క్ Tue, Apr 22, 2025, 04:54 PM