వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'

by సూర్య | Mon, Mar 17, 2025, 02:21 PM

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రం సెప్టెంబరు 5, 2024న పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ ని వాసులు చేసింది. ది గోట్ విజయ్ యొక్క 68వ చిత్రం. డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా సాధించిన యువ వెర్షన్‌తో విజయ్ ఈ చిత్రంలో రెండు లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ థ్రిల్లర్ 2004 మాస్కో మెట్రో బాంబు దాడి నుండి ప్రేరణ పొందింది మరియు తీవ్రమైన రైడ్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మనోబాలా, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM