సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత

by సూర్య | Sun, Mar 16, 2025, 11:22 AM

సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ ఆస్పత్రిపాలయ్యాడు. ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి మొదలవడంతో చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.  ఇప్పటికే ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్‌ సహా పలు టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఏఆర్‌ రెహమాన్‌.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్‌ చిత్రాలకు బ్లాక్‌బస్టర్‌ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్‌, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌-బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM