‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ?

by సూర్య | Sun, Mar 16, 2025, 10:42 AM

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అటు నిర్మాతగా ఇటు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీలలో ‘ది ప్యారడైజ్’ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.అనతి కాలంలోనే హిందీ‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా ఈ బ్యూటీ ఆల్‌‌ర్రేడి సుధీర్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ‘జటాధర’ చిత్రంలో నటించబోతుంది. అయితే తాజాగా సోనాక్షి సిన్హాని ‘ది ప్యారడైజ్’ లో ఓ కీలక పాత్ర కోసం అప్రోచ్ అయినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. అంతేకాదు ఈ మూవీలో సోనాక్షి సిన్హా పై ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు పక్కా ఫుల్ మీల్స్‌లా ఉంటుందట.


Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM