'కింగ్డమ్' టీజర్ OST విడుదలకి తేదీ లాక్

by సూర్య | Sat, Mar 15, 2025, 08:46 PM

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్  విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం కింగ్డమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క  టీజర్ ని మేకర్స్ ఇటీవలే విడుదల చేసారు. జూనియర్ ఎన్టీఆర్  యొక్క కమాండింగ్ వాయిస్‌ఓవర్‌తో, విజువల్స్ సరికొత్త స్థాయిని తాకింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ OST ని మార్చి 17న సాయంతరం 6:03 గంటలకి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కొంతకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. గౌతమ్ ఈ చిత్రానికి కథ అందించారు. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం మే 30, 2025న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Latest News
 
సత్యదేవ్ కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ Tue, Apr 22, 2025, 07:01 PM
భారీ మొత్తానికి అమ్ముడయినా 'జన నాయగన్' థియేట్రికల్ హక్కులు Tue, Apr 22, 2025, 06:54 PM
'పెద్ది' పై బుచి బాబు సనా కీలక వ్యాఖ్యలు Tue, Apr 22, 2025, 05:38 PM
'RAPO22' ఫస్ట్ సింగల్ విడుదలపై లేటెస్ట్ బజ్ Tue, Apr 22, 2025, 05:28 PM
ఒక ట్విస్ట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న 'హరి హర వీర మల్లు' Tue, Apr 22, 2025, 05:04 PM