బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కన్నడ భామలు

by సూర్య | Tue, Feb 18, 2025, 11:38 AM

ప్రస్తుతం వరుస విజయాలతో కన్నడ భామ రశ్మిక మందణ్ణ  బాలీవుడ్ లో కవాతు చేస్తోంది. రశ్మిక నాయికగా రూపొందిన తాజా హిందీ చిత్రం 'ఛావా' టాక్ ఎలా ఉన్నా భారీ వసూళ్ళు చూస్తోంది. దాంతో రశ్మిక కిట్ లో మరో హిట్ పడ్డట్టే! ఈ సినిమాకు ముందు రశ్మిక నటించిన 'ఏనిమల్' హిందీ చిత్రం బంపర్ హిట్ గా నిలచింది. ఇక 'పుష్ప-2' హిందీలో డబ్ అయి అక్కడా జయకేతనం ఎగురవేసింది. అలా వరుసగా మూడు బంపర్ హిట్స్ కొట్టేసిన రశ్మిక హిందీలో 'హ్యాట్రిక్' సొంతం చేసుకుందన్న మాట! ఇలా సౌత్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తూనే ఉత్తరాదిన కూడా విజయకేతనం ఎగరేసిన కన్నడ భామల్లో బి.సరోజాదేవి  తరువాత రశ్మికనే ఆ స్థాయి సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.కన్నడసీమలో పుట్టిన భామలు, ఆ ప్రాంతానికి చెందిన ముద్దుగుమ్మలు సైతం బాలీవుడ్ ను భమ్ చిక భమ్ ఆడించిన వారున్నారు. అలాంటి వారిలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను ముందుగా చెప్పుకోవాలి. ఈ మంగళూరు బ్యూటీ తమిళ చిత్రం 'ఇరువర్'తో పరిచయమైనా, బాలీవుడ్ బాట పట్టాకే బంపర్ హిట్స్ సొంతం చేసుకుంటూ సాగారామె. కొన్ని తెలుగు చిత్రాల్లోనూ మురిపించిన పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి సైతం మంగళూరు ముద్దుగుమ్మనే. ఆమె కూడా ఉత్తరాదిన సక్సెస్ రూటులో సాగిపోయారు. జెనీలియా డిసౌజా  ముంబైలోనే కన్ను తెరచినా ఆమె కన్నవారు కన్నడనేలకు చెందినవారే! అలా ఆమె కూడా మంగళూర్ బ్యూటీ అని చెప్పొచ్చు. దీపికా పదుకొణే  'ఓం శాంతి ఓం' హిందీ చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అయ్యాక అక్కడే తన లక్ టెస్ట్ చేసుకుంటూ ఆమె కూడా వరుస విజయాలు చూశారు. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ ఫైవ్ హీరోయిన్స్ లో తనకంటూ ఓ స్థానం దీపిక సంపాదించారు.

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM