![]() |
![]() |
by సూర్య | Mon, Feb 17, 2025, 08:52 PM
ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. అలా ఈ మధ్యకాలంలో తెలుగువారి అభిమానం చూరగొన్న తమిళ హీరో ఎవరంటే శివకార్తికేయన్ అనే చెప్పాలి. గత యేడాది శివకార్తికేయన్ నటించిన 'అమరన్' తమిళంతో పాటు తెలుగులోనూ విజయఢంకా మోగించింది. అలాగే తెలుగు చిత్రం 'కౌసల్యా కృష్ణమూర్తి' లో కీలక పాత్ర ధరించారు శివకార్తికేయన్. 'అమరన్' చిత్రం 300 కోట్లు పోగేయడంతో తమిళ టాప్ స్టార్స్ సరసన చేరిపోయారు శివ కార్తికేయన్. ఫిబ్రవరి 17న నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న శివకార్తికేయన్ పట్టుదల చూస్తే అది భావితరాలకు ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
Latest News