ఈ స్టార్ డైరెక్టర్స్ ను పొగుడుతున్నాడా? తిడుతున్నాడా?

by సూర్య | Mon, Feb 17, 2025, 08:49 PM

బాహుబలి, ట్రిపుల్ ఆర్' చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళిపై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్  ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రం ఏమంటే... ఈ సినిమాలను హిందీలో పంపిణీ చేసింది కరణ్ జోహార్ కు చెందిన ధర్మా ప్రొడక్షన్సే! రాజమౌళినే కాదు... పనిలో పనిగా కరణ్‌ జోహార్... 'యానిమల్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను, 'గదర్' దర్శకుడు అనిల్ శర్మ ను కూడా ఏకిపారేశాడు. అయితే... ఈ కోటింగ్ ను చాలా సుతిమెత్తగా వేశాడు.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలను చూస్తే... అందులో అసలు లాజిక్కే ఉండదని తేల్చేశాడు కరణ్ జోహార్. అలానే ఈ మధ్య వచ్చిన 'యానిమల్' సైతం అలాంటి సినిమానే అన్నాడు. ఇక అనిల్ శర్మ తెరకెక్కించిన 'గదర్', 'గదర్ -2' చిత్రాలైతే మరీ దారుణం అన్నాడు. ఓ వ్యక్తి బోర్ పంపుతో వెయ్యిమందిని ఎదుర్కోవడం అనేది ఈ సినిమాలో చూస్తామని, నిజ జీవితంలో ఇలాంటివి సాధ్యామా?అని ప్రశ్నించాడు. మళ్ళీ ఈ ప్రశ్నకు తనే సమాధానం చెబుతూ, 'దర్శకుడు అనిల్ శర్మ... సన్నీడియోల్  మాత్రం అలా ఎదుర్కోగలడనే భావన ప్రేక్షకులకు కలిగేలా సినిమాను రూపొందించాడ'ని తెలిపాడు.సందీప్ రెడ్డి వంగకూ అప్లయ్ చేశాడు కరణ్ జోహార్. ''ఈ ఇద్దరు దర్శకులు తీసిన సినిమాల్లోని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉంటాయి. అస్సలు లాజికల్ గా ఉండవు. కానీ తెరమీద ఆ సీన్స్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం అర్థం కాదు... దానిని పట్టించుకోకుండా ఆ సన్నివేశంలో మమేకమైపోతారు. దర్శకుడికి తాను రాసుకున్న సీన్స్ మీద కన్విక్షన్ ఉంటేనే ఇలాంటివి తీయగలడు, ప్రేక్షకులను మైమరిపించగలడు. ఈ ఇద్దరు దర్శకులలో ఆ క్రియేటివిటీ బాగా ఉంది. అందుకే వాళ్ళ సినిమాల్లో లాజిక్స్ కోసం జనాలు వెతకరు సరికదా వాటిని ఎంజాయ్ చేస్తూ ఘన విజయాలను కట్టబెడుతున్నారు'' అంటూ ముక్తాయింపు ఇచ్చాడు.కరణ్ జోహార్ కామెంట్స్ విన్నవారికి ఆయన ఈ స్టార్ డైరెక్టర్స్ ను పొగుడుతున్నాడా? తిడుతున్నాడా? అనే సందేహం వచ్చి తీరుతుంది. అంతే కాదు... వీరు తీసిన సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకుల గురించి కరణ్ జోహార్ ఏం చెప్పదలుచుకున్నాడు? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఏదేమైనా... కరణ్‌ జోహార్... రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, అనిల్ శర్మపై చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM