అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న అట్లీ

by సూర్య | Wed, Feb 12, 2025, 12:18 PM

బాలీవుడ్ డెబ్యూ మూవీ 'జవాన్'తో రూ. 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ సౌతిండియన్ డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్, సల్మాన్ ఖాన్ తో ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిలో హీరోయిన్ గా రష్మిక మందన్నని పరిశీలిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి అట్లీ గతంలో ప్రస్తావిస్తూ.. 'ఈ సినిమా భారత దేశానికే గర్వకారణం' అని ప్రమోట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.ఇక నెక్ట్స్ అల్లు అర్జున్ తో తన ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండనుంది. ఇందులో బన్నీ ఓ కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా మైథలాజికల్ జోనర్ అన్న ప్రచారం అనౌన్స్‌మెంట్ నుంచి జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇందులో 'సుబ్రహ్మణ్య స్వామి'గా కనిపించనున్నాడని తెలుస్తొంది. 'గాడ్ ఆఫ్ వార్'గా కార్తకేయుడికి ఉన్న పేరుకు తగ్గట్టుగా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, పురాణాల స్పూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ లో పురాణ ఇతిహాస కథలకు మంచి మార్కెట్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. పురాణాల రిఫరెన్సులతో ఆడియెన్స్ ఈజీగా మాయాజాలం చేయగలడు. దీంతో బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాస్తవానికి ప్రభాస్ తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్‌లో ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకునే ఛాన్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు దక్కింది. కానీ ఆ ఛాన్స్ ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. బన్నీ మాత్రం కరెక్ట్ స్టెప్ తీసున్నాడు అంటున్నారు అంతా.

Latest News
 
ప్రభాస్‌ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ Thu, Mar 27, 2025, 08:31 PM
మరికొన్ని గంటలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'మజాకా' Thu, Mar 27, 2025, 06:20 PM
'పెద్ది' చిత్రం పై నిర్మాత రవి కీలక వ్యాఖ్యలు Thu, Mar 27, 2025, 05:33 PM
సాయంత్రం ప్రదర్శనల నుండి ప్రారంభం కానున్న 'వీర ధీర సూరన్: పార్ట్ 2' Thu, Mar 27, 2025, 04:30 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మాడ్ స్క్వేర్' Thu, Mar 27, 2025, 04:23 PM