అస్వస్థతకి గురైన కమెడియన్ పృథ్వీ రాజ్

by సూర్య | Wed, Feb 12, 2025, 12:12 PM

సీనియర్ నటుడు, కమెడియన్ పృథ్వీ రాజ్ ఆసుపత్రిలో చేరాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చేరుతున్న విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆయన 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం లేపిన విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా పృథ్వీ పేరు మార్మోగుతోంది. అయితే ఆయనకు బీపీ పెరగడంతోనే ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం.ఆదివారం విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫిల్మ్ 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పృథ్వీ మాట్లాడుతూ.. ' నేను ఈ సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు మొత్తం 175 మేకలు ఉండేవి ఆ తర్వాత 151 అయ్యాయి.. కానీ సినిమా పూర్తయ్యే సమయానికి 11 మేకలు అయ్యాయి. ఇది యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో ఏమో తెలియదు' అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో వైసీపీ శ్రేణులు బాయ్ కాట్ లైలా అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాత సాహూ గార్లపాటి, హీరో విశ్వక్ సేన్ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఈ క్రమంలోనే పృథ్వీ రాజ్ అస్వస్థతకు గురికావడం.. ఇంతకు ఎం జరిగి ఉండొచ్చని అందరిలో ఆసక్తిని రేపుతోంది.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM