యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.!

by సూర్య | Fri, Jan 24, 2025, 08:32 PM

యశ్‌  హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ ‘టాక్సిక్‌’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారంటూ ఎంతో మంది కథానాయికల పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ప్రాజెక్టులో నయనతార  భాగమైనట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్‌ ఒబెరాయ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ప్రస్తుతం నేను రాకింగ్‌ స్టార్‌ యశ్‌  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా. దీనిలో నయనతార కూడా భాగమయ్యారు. ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడించకూడదు. త్వరలోనే గీతూ మోహన్‌ దాస్‌ ఓ ప్రకటన చేస్తారు. అప్పటి వరకు వేచిచూడండి’’ అని అక్షయ్‌ అన్నారు. నయనతార ఏ పాత్రలో కనిపించనున్నారనే దానిపై స్పష్టత లేదు. ఇక ఇందులో బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ కూడా నటించునున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వీటిపై గతంలో టీమ్‌ స్పందిస్తూ అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని కోరింది.

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM