బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం అంటూ పేర్కొన్న నటి

by సూర్య | Tue, Jan 21, 2025, 09:25 PM

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ శివారులో ఉంది. స్వామివారిని వీసాల దేవుడిగా కూడా చెబుతారు. నటి ప్రియాంక చోప్రా బాలాజీని దర్శించుకొని, ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM