తెలంగాణ మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చి వేణుస్వామి క్షమాపణలు చెప్పారు

by సూర్య | Tue, Jan 21, 2025, 07:46 PM

తెలంగాణ మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చిన ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణలు కోరారు. వారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. నటీనటులపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ నోటీసులను వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. అయితే మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ మహిళా కమిషన్‌కు వచ్చిన వేణుస్వామి క్షమాపణలు చెప్పారు.

Latest News
 
సూట్​లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ! Sun, Mar 23, 2025, 02:53 PM
నెగిటివ్ రోల్‌లో అల్లు అర్జున్ Sun, Mar 23, 2025, 02:33 PM
‘జాట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 23, 2025, 02:27 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బాలకృష్ణ, ప్రభాస్‌, గోపిచంద్‌పై ఫిర్యాదు Sun, Mar 23, 2025, 12:32 PM
నా జర్నీలో వారంతా నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు Sun, Mar 23, 2025, 11:54 AM