మాస్ రెస్పాన్స్ అందుకుంటున్న 'భైర‌వం' టీజ‌ర్....

by సూర్య | Mon, Jan 20, 2025, 09:45 PM

టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీల‌క పాత్ర‌ల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుద‌ల‌ చేశారు. టీజ‌ర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టారు. వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ ముగ్గురు హీరోల ప‌క్క‌న దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది క‌థానాయిక‌లుగా న‌టించారు. అలాగే జయసుధ, ప్రియమ‌ణి కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. 



 

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM