చిరంజీవితో సినిమా పై అనిల్ ఆసక్తికరవ్యాఖ్యలు

by సూర్య | Sun, Jan 19, 2025, 05:40 PM

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా సెట్స్‌పైకి రానున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ.. తదుపరి తన సినిమా చిరుతోనే అన్నట్లుగా హింట్ ఇచ్చారు. అయితే ఆయన, తన తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై చేసిన వ్యాఖ్యలు అందరికీ షాకిచ్చాయి. ఏంటా షాక్? అనుకుంటున్నారా.. విషయంలోకి వస్తే..మెగాస్టార్ చిరంజీవికి అనిల్ రావిపూడి కేవలం లైన్ మాత్రమే వినిపించాడట. ‘‘చిరంజీవి గారితో సినిమా ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒక కథకి సంబంధించి లైన్‌ అనుకున్నాం. అది ఆయనకు నచ్చింది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం..’ అయిపోయింది కాబట్టి దానిమీద వర్క్‌ చేయాలి. ఆయనకు చెప్పాలి. ఆ తర్వాత ఎప్పుడు టేకాఫ్‌ అవుతుందనే విషయాన్ని ప్లాన్‌ చేయాలి..’’ అని తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా షాకవుతున్నారు.

Latest News
 
SMB 29: ఈసారి వెయిట్ లేదు, Globetrotter విడుదల డేట్ బయటపెట్టారు Sat, Nov 15, 2025, 10:53 PM
Varanasi Movie: మహేశ్ స్టైలిష్ స్పెషల్ క్లిప్ వచ్చేసింది! Sat, Nov 15, 2025, 10:18 PM
రాజమౌళి స్పెషల్ అప్‌డేట్: గ్లోబ్ ట్రాటర్ టైటిల్ & గ్లింప్స్ రెడీ! Sat, Nov 15, 2025, 08:24 PM
మహేష్‌బాబు సినిమా టైటిల్ రిలీజ్‌.. అభిమానుల్లో జోష్ Sat, Nov 15, 2025, 07:30 PM
మాస్ జాతర.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్! Sat, Nov 15, 2025, 04:41 PM