23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్

by సూర్య | Sun, Jan 12, 2025, 08:51 PM

టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటించిన హిట్ సినిమాల్లో ‘మన్మథుడు’ ఒకటి. ఈ సినిమాలో నాగార్జున, బ్రహ్మనందం కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన అన్షు అంబానీ 23 ఏళ్ల తర్వాత మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న 'మజాకా' సినిమాలో అన్షు కీలకపాత్ర పోషించింది. ధమాకా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రినాథ రావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా త్రినాథ రావు మాట్లాడుతూ అన్షుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం అందరినీ షాకయ్యేలా చేసింది."అన్షు లాంటి హీరోయన్.. ఎప్పుడో మేము యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడో ఇంకా చిన్నప్పుడో నాకు గుర్తులేదు. మన్మథుడు సినిమా చూసి ఏందిరా ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉంది అనుకునేవాడ్ని అప్పుడు.. ఆ అమ్మాయిని చూడటానికే మన్మథుడు సినిమాకి వెళ్లిపోయేవాళ్లం.. ఓ రేంజ్‌లో ఉండేదయ్యా బాబూ.. మీకు తెలీకపోతే ఒకసారి ఫొటో పెట్టి చూడండి.. నెక్ట్స్ లెవల్. అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్‌గా కళ్ల ముందు కనబడేసరికి ఇది నిజమేనా అనిపించింది.

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM