'నరుడి బ్రతుకు నటన' నుండి ది కేరళ సాంగ్ అవుట్

by సూర్య | Thu, Dec 12, 2024, 11:54 AM

"హిట్: ది 2వ కేస్" మరియు "ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్" వంటి చిత్రాలలో తన పాత్రలకు పేరుగాంచిన ప్రతిభావంతుడైన తెలుగు నటుడు శివ కుమార్ తన ఇటీవలే  చిత్రం "నరుడి బ్రతుకు నటన"తో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం ఇప్పుడు ఆహా మరియు ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుండి ది కేరళ సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. రిషికేశ్వర్ యోగి ఈ చిత్రానికి రచయిత, ఎడిటర్ మరియు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, TG విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి మరియు డాక్టర్ సింధూ రెడ్డి నిర్మాతలగా ఉన్నారు. ఈ చిత్రంలో శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివిఎ రాఘవ్ మరియు దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'డాకు మహారాజ్' 5 రోజుల్లో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Jan 17, 2025, 05:02 PM
'బ్రహ్మానందం' టీజర్ అవుట్ Fri, Jan 17, 2025, 04:56 PM
జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత ! Fri, Jan 17, 2025, 04:07 PM
నిషా కళ్లతో మత్తెక్కించే చూపులతో వైష్ణవి చైతన్య అందాలు...ఫొటోస్ Fri, Jan 17, 2025, 03:45 PM
పవన్ మార్క్ ఫోక్ సాంగ్ తో ట్రీట్ Fri, Jan 17, 2025, 03:38 PM