'గేమ్ ఛేంజర్' పై కీలక వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద విమర్శకుడు

by సూర్య | Tue, Dec 10, 2024, 05:03 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాక్షన్ డ్రామా  చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో జనవరి 10, 2025న విడుదల కానుంది. రాజమౌళి యొక్క మాగ్నమ్ ఓపస్ RRRతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ మొదటి పూర్తి స్థాయి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో, వివాదాస్పద విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ (KRK) గేమ్ ఛేంజర్‌పై అవమానకరమైన మరియు అనుచిత వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ భోజపురి వెర్షన్ వచ్చే విడుదల అయ్యి షాట్ డిసాస్టర్ గా నిలుస్తుంది. ఆపై మెగా ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ కంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే 10 రెట్లు పెద్దవాడని అర్థం చేసుకుంటారు అని పోస్ట్ చేశాడు. కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
సంక్రాంతికి వస్తున్నాం: సినిమా రికార్డులపై వ్యాఖ్యానించిన వెంకటేష్ Fri, Jan 24, 2025, 09:25 PM
పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో 'వెంక‌ట‌ల‌చ్చిమి' సినిమా ఘ‌నంగా ప్రారంభం Fri, Jan 24, 2025, 08:44 PM
యశ్ ‘టాక్సిక్​’లో​ న‌య‌న‌తార‌.! Fri, Jan 24, 2025, 08:32 PM
నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజున వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించిన MB ఫౌండేషన్ Fri, Jan 24, 2025, 07:36 PM
'మధగజ రాజా' తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Jan 24, 2025, 07:31 PM