హీరో రామ్ కు ఫైన్ విధించిన పోలీసులు!

by సూర్య | Mon, Jun 24, 2019, 07:08 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఫ్యాచ్ వర్క్ షూట్ ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సీన్ చిత్రీకరణలో భాగంగా రామ్ సిగరెట్ తాగాడు. అయితే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ స్మోకింగ్ నిషేదం అనే రూల్ ఉంది. ఆ విషయం తెలియని యూనిట్ సభ్యులు ఆ సీన్‌ను షూట్ చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సిగరెట్ పై ఉన్న నిషేదంను రామ్ అతిక్రమించినందుకు గాను తెలంగాణ పోలీసులు అతడికి ఫైన్ వేసినట్లు ఛార్మినార్ సీఐ తెలిపారు. 200 రూపాయల ఫైన్ ను రామ్ చెల్లించినట్లుగా తెలుస్తోంది. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం కీలక ప్రాంతాలైన కొన్ని చోట్ల ఓపెన్ గా దూమపానం చేయడం నిషిద్దం.


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM