తన తండ్రి స్కూటర్ ఫై చక్కర్లు కొడుతున్న సోనూసూద్

by సూర్య | Mon, Jun 24, 2019, 03:20 PM

ప్రముఖ నటుడు సోనూసూద్ తన తండ్రి శక్తి సూద్ ను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇంట్లో తన తండ్రికి చెందిన పాత బజాబ్ చేతక్ స్కూటర్ పై సోనూ ఈరోజు చక్కర్లు కొట్టారు. అనంతరం ఈ విషయమై స్పందిస్తూ..‘ఇది నాన్న స్కూటర్. ఈ స్కూటర్ నాకు చాలా స్పెషల్. సినిమాల్లోకి వచ్చాక నాన్నకు కొత్త కారు, కొత్త బైక్ కొనిచ్చాను. కానీ ఈ స్కూటర్ మాత్రమే ఆయన ఫేవరెట్ గా నిలిచింది.


ఇక ఇది ఎప్పటికీ  నా ఫేవరెట్ గా ఉండిపోతుంది. ఈ స్కూటర్ పై ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రైడ్ చేస్తా. ఈ స్కూటర్ ఇంజిన్ సౌండ్ మిశ్రమమైన అనుభూతి కలుగుతోంది. మిస్ యూ డాడ్’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్కూటర్ నడిపిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధడిపన శక్తిసూద్ 2017, ఫిబ్రవరి 7న తుదిశ్వాస విడిచారు.

Latest News
 
'మనమే' టీజర్ అవుట్ Fri, Apr 19, 2024, 02:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'పోకిరి' Fri, Apr 19, 2024, 02:24 PM
ఛార్మి లేటెస్ట్ లుక్ Fri, Apr 19, 2024, 02:17 PM
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM