ఇండస్ట్రీలో ఆడవాళ్ల కష్టాలు, ఆకలి బాధను గుర్తించండి: హేమ

by సూర్య | Mon, Jun 24, 2019, 02:28 PM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నటి హేమ ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు కష్టాలు పడుతున్నారని, అలాంటివాళ్లను ఆదుకోవాల్సిన అవసరం దర్శకనిర్మాతలపై ఉందని స్పష్టం చేశారు. 


"ముందు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు తిండి పెట్టండి. ఎక్కడో బయటి నుంచి లేడీ ఆర్టిస్టులను తీసుకువచ్చి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేయొద్దు. ఇవాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ల ఆకలి బాధను గుర్తించండి. 'మా'లో 800 మంది సభ్యులుంటే వాళ్లలో ఓ 150 మంది మహిళలు ఉంటారు. కనీసం వాళ్లకు అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేమా? మీ కాళ్లకు దండం పెడతాను సార్, దయచేసి మన తెలుగు మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వండి" అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM