చిరంజీవిలో నచ్చే గుణం అదే : మురళీమోహన్

by సూర్య | Mon, Jun 24, 2019, 01:59 PM

తాజా ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ, చిరంజీవితో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. 'మనవూరి పాండవులు' సినిమా నుంచి చిరంజీవి నన్ను 'అన్నయ్యా' అని పిలిచేవాడు. అప్పటికే నేను కొన్ని సినిమాలు చేసి ఉండటం వలన, నాకు ఎక్కువ క్రేజ్ ఉండేది. ఎక్కడికి వెళ్లినా అభిమానులు వచ్చి నా చుట్టూ చేరేవారు.


అది చూసిన చిరంజీవి 'నా కోసం కూడా ఇలా అభిమానులు వస్తారా' అని అడిగాడు. 'తప్పకుండా వస్తారు .. నువ్వు అంత గొప్పవాడివి అవుతావు' అని నేను చెప్పాను. 'మనవూరి పాండవులు' సినిమాలో చిరంజీవి నటన .. డాన్స్ చూసే ఆయన పెద్ద హీరో అవుతాడని అనుకున్నాను .. అలాగే జరిగింది. మొదటి సినిమాకి చిరంజీవి ఎంత కష్టపడ్డాడో .. ఇప్పుడూ అంతే కష్టపడతాడు. అదే ఆయనలో నాకు నచ్చే గుణం" అని ఆయన చెప్పుకొచ్చారు.

Latest News
 
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM
రాజస్థాన్‌లో 'టైసన్ నాయుడు' కొత్త షెడ్యూల్ Tue, Apr 23, 2024, 07:28 PM
'అఖండ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Tue, Apr 23, 2024, 07:25 PM