మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన నిధి అగర్వాల్

by సూర్య | Mon, Jun 24, 2019, 12:56 PM

నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్య సాచి’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ హీరోయిన్ నిధి అగర్వాల్ కు మాత్రం యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. వెంటనే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ లో కూడా నటించింది ఈభామ. సాధారణముగా రెండు డిజాస్టర్లు పడితే.. ఏ హీరోయినయినా అవకాశాలు దక్కించుకోవడం సులభం కాదు. కానీ నిధికి వెంటనే పూరి, రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఛాన్స్ కొట్టేసింది. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఆమె గ్లామర్ కి ఉన్న క్రేజ్ ఏంటనేది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.. వెంటనే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిందట.


కోలీవుడ్ హీరో జయం రవి 25వ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది నిధి. తాజాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. అలాగే జయం రవి కూడా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు పూర్తవుతుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం నిధి అగర్వాల్ తమిళంలో మంచి ఆఫర్లు దక్కించుకునే అవకాశం కచ్చితంగా ఉంది. ఒక్క హిట్టు లేకపోయినా ఈమెకు వరుస అవకాశాలు రావడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యం కలిగించే విషయం.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM