స‌రిలేరు నీకెవ్వ‌రు...అమ్రిష్ పురి 87వ జయంతి నేడు !

by సూర్య | Sat, Jun 22, 2019, 11:22 PM

ప్రముఖ నటుడు అమ్రిష్ పురి 87వ జయంతి నేడు. ఈ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆయనకు నివాళులిచ్చింది. అమ్రిష్ పురి ఫొటోతో ప్రత్యేక డూడుల్‌ను తయారు చేసిన గూగుల్.. ఆయనను గుర్తుచేసుకుంది. 1932లో పాకిస్థాన్‌లో పంజాబ్‌లో జన్మించిన అమ్రిష్ పురి.. 39వ ఏట నటుడిగా ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కారెక్టర్ ఆర్టిస్ట్‌లు మదన్ పురి, చామన్ పురి సోదరుడైన అమ్రిష్.. 1954లో ఓ సినిమాలో లీడ్ రోల్‌కు ఎన్నికయ్యాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ఆఫర్ మరొకరికి వరించింది. ఆ తరువాత పలు సినిమాలకు డబ్బింగ్ చెప్తూ వచ్చిన ఆయన 1971లో ‘రేష్మా ఔర్ షేరా’ అనే హిందీ చిత్రం ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. పది తరువాత తరువాత ఆస్కార్ విన్నింగ్ చిత్రం ‘గాంధీ’ ద్వారా హాలీవుడ్‌లోనూ ఆయన సత్తా చాటాడు. 38 సంవత్సరాల పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళీ భాషల్లో ఆయన 200కు పైగా సినిమాల్లో నటించిన అమ్రిష్ పురి.. భారత సినీ చరిత్రలో ఉత్తమ విలన్‌గా పేరును సంపాదించుకున్నాడు. కాగా ప్రముఖ హాలీవుడ్ డైరక్టర్ స్వీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ దూమ్‌’లో ఆఫర్‌ను మొదట అమ్రిష్ పురి వద్దనుకున్నాడు. కానీ స్వీల్‌బర్గ్ బలవంతం చేయడంతో ఆయన ఈ సినిమాను చేశాడు. ఇక ఆ మూవీలో అమ్రిష్ నటనకు ముగ్ధుడైన స్వీల్‌బర్గ్.. ‘‘నా ఫేవరెట్ విలన్ అమ్రిష్ పురినే. ఇలాంటి గొప్ప విలన్ ప్రపంచంలో మరొకరు రారేమో’’ అని ప్రశంసలు కురిపించాడు. అంతటి పేరుపొందిన అమ్రిష్ అనారోగ్య కారణాలతో 2005లో కన్నుమూశారు. ఇదిలా ఉంటే హిందీలో ‘మిస్టర్ ఇండియా’, ‘హిందూస్థాన్ కీ కసమ్’, ‘దిల్ వాలే దుల్హానియే లేజాయేంగే’, ‘లఖన్’, ‘దోస్తానా’, ‘శక్తి,’ ‘కూలీ’ వంటి చిత్రాల్లో నటించిన అమ్రిష్.. తెలుగులో ‘మేజర్ చంద్రకాంత్, ‘నిప్పురవ్వ’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘అశ్వమేధ’, ‘అఖరి పోరాటం’ వంటి చిత్రాల్లో కనిపించిన విషయం తెలిసిందే.

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM