స్కై డైవింగ్ లో అంజలి పుట్టిన రోజు వేడుక‌లు!

by సూర్య | Sat, Jun 22, 2019, 11:13 PM

హీరోయిన్ అంజలి ఈ మధ్య “లిసా”అనే హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టారు . ఆమె తెలుగు తమిళ భాషలలో వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అంజలి ఆనందభైరవి, గీతాంజలి-2, సైలెన్స్ మోవీలతో పాటు మరో రెండు మూడు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా జూన్16న తన పుట్టినరోజును విభిన్నంగా జరుపుకొని మరోసారి వార్తలో నిలిచారు అంజలి. అనుష్క,మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న”సైలెన్స్” మూవీలో అంజలి ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు . ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన అంజలి తన పుట్టిన రోజున స్కై డైవింగ్ చేసి సాహసోపేతంగా జరుపుకున్నారు. మగాళ్లు సైతం భయపడే ఈ సహస క్రీడలో అంజలి పాల్గొనడంతో ఆమె ధైర్యానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. కొంచెం ఆలస్యంగా ఈ విషయాన్నీ స్వయంగా అంజలి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.


 

Latest News
 
వివాదాస్పద TikTok స్టార్ కన్నుమూత Tue, Apr 16, 2024, 02:50 PM
రేపే 'పోటెల్' టీజర్ విడుదల Tue, Apr 16, 2024, 02:46 PM
కీలక షెడ్యూల్ ని ముగించుకున్న 'రాబిన్‌హుడ్' Tue, Apr 16, 2024, 02:44 PM
ఆఫీసియల్ : 'ఆ ఒక్కటి అడక్కు' విడుదలకి తేదీ లాక్ Tue, Apr 16, 2024, 02:37 PM
నేడు విడుదల కానున్న 'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ Tue, Apr 16, 2024, 02:34 PM