by సూర్య | Thu, Nov 14, 2024, 04:26 PM
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన నటీనటుల్లో రీతూ చౌదరి కూడా ఒకరు. హీరోయిన్‌లకు ఏమాత్రం తగ్గని పర్ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రాళ్లు గిలిగింతలు పెడుతుంటారు రీతూ.అలాగే తనదైన కామెడీ టైమింగ్‌తో పలు షోలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు ఆమె. జబర్దస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లో ఉన్నప్పుడు బాగా పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి.. తొలినాళ్లలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ఎప్పుడయితే జబర్దస్త్ షోలోకి ఎంటరైందో నాటి నుంచి జనానికి బాగా నోటెడ్ అయ్యారు రీతూ చౌదరి. జబర్దస్ ఒక్కటే కాకుండా ఈటీవీలోనే ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ సహా పలు షోలలోనూ తన కామెడీ టైమింగ్‌తో ఆమె అలరిస్తున్నారు. వీటితో పాటు తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తున్నారు రీతూ.అందరూ సెలబ్రెటీల మాదిరిగానే రీతూ చౌదరి పర్సనల్ లైఫ్ మీద ఎన్నో రూమర్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇతను ఓ బిజినెస్‌మెన్ అని, రాజకీయాల్లోనూ పలుకుబడి ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తర్వాత ఇద్దరూ కలిసి జంటగా కొన్నాళ్లు కనిపించారు. కానీ ఈ మధ్య రీతూ పెట్టే ఫోటోలు, వీడియోలలో సింగిల్‌గానే కనిపిస్తున్నారు.
ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలో గతేడాది నవంబర్‌లో రీతూ చౌదరి తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆ షాక్ నుంచి తేరుకుని తిరిగి తన షోలు, ఇతర కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు రీతూ చౌదరి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ చౌదరి ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుపోతుంటారు . మోడ్రన్ డ్రెస్సులే కాదు అప్పుడప్పుడు సాంప్రదాయబద్ధంగా చీర కట్టి అందాలు ఆరబోయడంలో రీతూ చౌదరి దిట్ట.తాజాగా ఈ జబర్దస్త్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఓ కుర్రాడితో ఫోటోలకు ఫోజులిచ్చిన ఆమె న్యూ బిగినింగ్ అంటూ రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు షాకయ్యారు. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ పెట్టారు. నిజానికి రీతూ చౌదరి వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ఆమెతో కలిసి ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు విజయ్ రాజా. టాలీవుడ్ సీనియర్ నటుడు , కమెడియన్ శివాజీ రాజా కుమారుడు.ప్రస్తుతం సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు విజయ్ రాజా. ఈ నేపథ్యంలో రీతూ చౌదరితో కలిసి హాస్పిటాలిటీ, అతిథ్య రంగంలో sukha farm stay పేరుతో విజయ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లుగా బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. కంటైనర్ ఫార్మ్ స్టే , ప్రైవేట్ పూల్, ఔట్ డోర్ థియేటర్, ఈవెంట్ స్పేస్ , ఒకేసారి 300 మంది అతిథులు పాల్గొనేలా సకల సదుపాయాలు ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో రీతూ చౌదరి ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలని ఆకాంక్షిద్దాం.