by సూర్య | Thu, Nov 14, 2024, 03:58 PM
నటి, బీజేపి నాయకురాలు కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగుజాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
Latest News