హీరో సుశాంత్‌తో 'లక్కీ భాస్కర్' నటి ప్రేమాయణం?

by సూర్య | Thu, Nov 14, 2024, 12:30 PM

హీరో సుశాంత్‌, మీనాక్షి చౌద‌రి క‌లిసి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే మూవీలో జంట‌గా న‌టించిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌద‌రి ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నుంచే వీళ్లిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా దీనిపై సుశాంత్, మీనాక్షి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మ‌రోవైపు నాగ చైత‌న్య పెళ్లి అనంత‌రం వీరిద్ద‌రి పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే తాజాగా ఆమె ‘లక్కీ భాస్కర్‌’ సినిమాలో నటించింది.అయితే మీనాక్షి చౌదరికి సంబంధించిన మరో వార్త, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హిందీలో ‘అప్‌స్టార్స్’ అనే మూవీలో చిన్న రోల్ చేసిన మీనాక్షి చౌదరి, సుశాంత్‌ చేసిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా, సుశాంత్, మీనాక్షి చౌదరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, ఆ స్నేహం.. ప్రేమగా మారి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు సోషల్ మీడియా టాక్..


త్వరలోనే సుశాంత్‌తో మీనాక్షి చౌదరి ఎంగేజ్‌మెంట్ జరగబోతున్నట్టుగా మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి.. అక్కినేని నాగార్జున మేనల్లుడు అయిన సుశాంత్, 2008లో ‘కాళిదాసు’ సినిమాతో హీరోగా మారాడు. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా పదేళ్ల తర్వాత ‘చి. ల.సౌ’ సినిమాతో హిట్టు అందుకున్నాడు.


అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ మూవీలో చిన్న రోల్ చేసిన సుశాంత్, రవితేజతో ‘రావణాసుర’, చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు... 38 ఏళ్ల సుశాంత్‌, టాలీవుడ్‌లో ఎలాంటి వివాదాల్లోనూ ఇరుక్కోని హీరోల్లో ఒకడు.. మీనాక్షి చౌదరితో సుశాంత్ రిలేషన్ నిజమేనా? లేక కేవలం పుకారు మాత్రమేనా అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.. ఈ విషయం అటు ఉంచితే అక్కినేని హీరోలకు ఈ మ్యారేజ్‌లు అచ్చి రాలేదు.




Latest News
 
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM
మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట.. ఎందుకో తెలుసా ? Sun, Dec 01, 2024, 06:40 PM
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి? Sun, Dec 01, 2024, 06:36 PM
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి Sun, Dec 01, 2024, 06:34 PM