దూసుకొస్తున్న యష్మి..

by సూర్య | Thu, Nov 14, 2024, 11:49 AM

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 11వ వారంలోకి ప్రవేశించింది. మరికొద్దివారాల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కి ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా ఇప్పటికే రోహిణి , నబీల్ కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేశారు11వ వారం ఆరుగురు కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో ఉండగా.. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? ఈ వివరాల్లోకి వెళితే..సోమవారంతో నామినేషన్స్‌ రచ్చ ముగియడంతో తిరిగి మంగళవారం నుంచి ఫ్యామిలీ వీక్‌కు శ్రీకారం చుట్టారు బిగ్‌బాస్. బుధవారం హౌస్‌మెట్స్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. ఇంటి సభ్యులంతా ఫ్రీజ్ మోడ్‌లో ఉండాలని బిగ్‌బాస్ అంటాడు. ఇంతలో కంద అనే పిలుపు వినిపించగా.. అది నిఖిల్ వాళ్ల అమ్మ సులేఖ గొంతు. ఆమె వెనుకాలే వచ్చి కొడుకుని హత్తుకుంటుంది. తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్‌ని పలకరించారు. ఏడుస్తున్న తేజని హత్తుకుని, నేను మీ అమ్మనే అనుకో అంటూ హత్తుకున్నారు.తర్వాత కొడుకుతో పర్సనల్‌గా మాట్లాడిన సులేఖ.. యష్మితో జాగ్రత్త , గ్రూపిజం చూపించొద్దు, ఇకపై ఇండివిడ్యువల్‌గానే ఆడు అని కొడుక్కి జాగ్రత్తలు చెబుతుంది. హౌస్‌లో అందరితో బాగా మాట్లాడిన సులేఖ .. యష్మికి మాత్రం దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. యష్మి ఆమెను కలవాలని ప్రయత్నించినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. వెళ్తు వెళ్తూ కొడుకు కోసం గేమ్ ఆడిన సులేఖ.. మటన్‌ని గెలిచారు. తర్వాత యష్మి తండ్రి హౌస్‌లో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని పలకరించారు. తన బిడ్డ ఆవేశంలో ఏదైనా అంటే క్షమించమని కోరారు.


తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి రారని తెలిసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది గమనించిన గౌతమ్, రోహిణిలు తమకు బదులుగా తేజ పేరెంట్స్‌ను పంపించమని త్యాగానికి సిద్ధపడ్డారు. అనంతరం అవినాష్ భార్య అనూజ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. భార్యాభర్తలు ఇద్దరు డిన్నర్ చేసేలా బిగ్‌బాస్ ఏర్పాట్లు చేశాడు. దీనికి ఎమోషనలైన అవినాష్.. బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పాడు.రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా హౌస్‌లోకి తీసుకురానున్నాడు బిగ్‌బాస్. రోజూ అరుపులు, కేకలు, గొడవలతో హోరెత్తిపోయే బిగ్‌బాస్ హౌస్.. కొద్దిరోజులు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిపోనుంది. ఇకపోతే.. 11వ వారం బిగ్‌బాస్ తెలుగు 8లో ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. వారు గౌతమ్, టేస్టీ తేజ, యష్మి గౌడ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.ఆన్‌లైన్‌లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ ప్రకారం.. ఈ వారం కూడా గౌతమ్ ఓటింగ్‌లో టాప్‌లో నిలిచారు. దాదాపు 21.76 శాతం ఓటింగ్‌తో గౌతమ్ నెంబర్‌వన్‌గా ఉండగా, యష్మి గౌడ అతనికి గట్టి పోటీ ఇస్తున్నారు వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం పది శాతం మాత్రమే కావడంతో నేడో రేపో యష్మి ఓటింగ్‌లో టాప్‌లోకి రావొచ్చునని అంటున్నారు. తర్వాత టేస్టీ తేజ (16.35 శాతం), పృథ్వీరాజ్ (14.41 శాతం), అవినాష్ (13.75 శాతం) ఓటింగ్ సాధించారు. ఇక స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ నానాటికీ పడిపోతోంది. ప్రస్తుతానికి 12.07 శాతం ఓటింగ్‌తో ఆమె డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి టైం ఉండటంతో రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంది.

Latest News
 
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM
మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట.. ఎందుకో తెలుసా ? Sun, Dec 01, 2024, 06:40 PM
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి? Sun, Dec 01, 2024, 06:36 PM
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి Sun, Dec 01, 2024, 06:34 PM