by సూర్య | Wed, Nov 13, 2024, 04:04 PM
తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, మట్కా చిత్ర బృందం సభ్యులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న వరుణ్ అండ్ కో ఇవాళ తిరుమలకు వెళ్లారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News