రాజ‌కీయాల్లోకి రావాల‌ని ద‌ళ‌ప‌తికి ఫ్యాన్స్ అభ్య‌ర్ధ‌న‌!

by సూర్య | Sat, Jun 22, 2019, 10:58 PM

తమిళ రాజకీయాల్లోకి సినీతారల రంగం ప్రవేశం కొత్తేమి కాదు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, విజయ్ కాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సూపర్ స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ చేరిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇద్దరి తర్వాత మళ్ళీ అంతటి చరిష్మా ఉన్న హీరో దళపతి విజయ్. రజినీ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ‘తలా’ అజిత్.. ‘దళపతి’ విజయ్‌లకు మాత్రమే ఉంది. అందులోనూ విజయ్‌కి రాజకీయంగానూ పలుకుబడి ఉంది. అతడి తండ్రి ఎస్.ఏ చంద్రశేఖర్ తన కొడుకును ఉత్తమ నాయకుడిగా చూడాలనుందని గతంలో చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీశాయి. ఇదిలా ఉండగా విజయ్ ఫ్యాన్స్ మాత్రం ప్రతీ వేదికపైనా ‘దళపతి’ రాజకీయాల్లోకి రావాలంటూ వేడిని రాజేస్తున్నారు. కాగా ఈరోజు దళపతి పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులోని పలు నగరాల్లో వెలసిన కటౌట్లు.. ఫ్లెక్సీలు.. పోస్టర్లు ఈ వేడిని మరింత పెంచుతున్నాయి. పోస్టర్లపై ఫ్యాన్స్ ప్రజా సీఎం.. రేపటి సీఎం అంటూ ఆసక్తికర నినాదాల్ని ప్రచురించడంతో ఇప్పుడు ఇది కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.  మధురై – కోయంబత్తూరు- తిరునల్వేలి వంటి నగరాల్లో అభిమానులు  విజయ్ రాజకీయ అరంగేట్రంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పబ్లిక్‌గా కొన్ని పోస్టర్లతో హల్‌చల్ చేశారు. కొన్ని చోట్ల దళపతి రాజకీయల్లో రా.. అని పిలుపునిస్తూ పోస్టర్లు వెలిస్తే… మరికొన్ని చోట్ల రేపటి సీఎం అంటూ… ఇంకొన్ని చోట్ల ప్రజా సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏది ఏమైనా గత కొంతకాలంగా దళపతి విజయ్.. రాజకీయ రంగం ప్రవేశం చేస్తారని వార్తలు జోరుగా సాగాయి. కానీ ఇంతవరకు ఆయన నుంచి ఏవిధమైన అధికారిక ప్రకటన రాలేదు. అటు అభిమానులు మాత్రం వచ్చే ఎన్నికల్లో మా హీరో తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడని.. కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ‘బిజిల్’ సినిమా పోస్టర్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM