by సూర్య | Tue, Nov 12, 2024, 10:15 PM
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీ విడుదలకు ముందే కేరళలో రికార్డు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటి వరకు రూ.1.05 కోట్లు రాబట్టింది. ఇది సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బుకింగ్స్.కంగువ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించడంతో ఓవర్సీస్‌లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించగా మంచి రెస్సాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా ప్రీ సేల్స్ బుకింగ్‌ను కేరళ, తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటకలో ప్రారంభించగా రికార్డు లెవెల్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.కంగువ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు తమిళనాడులో భారీగా రెస్పాన్స్ వస్తున్నది. తొలి రోజునే ఈ సినిమా 1.20 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక కేరళలో ఊహించని రెస్పాన్స్ వస్తున్నది. తొలి రోజే రికార్డులు బ్రేక్ చేసే పనిలో కనిపించింది. మొదటి రోజే ధనుష్ నటించిన రాయన్ సినిమా వసూళ్లను అధిగమించి ఈ సినిమా 50 లక్షల రూపాయల కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఇక హిందీ వెర్షన్ 10 లక్షల రూపాయలు రాబట్టింది.
Latest News