షూటింగ్‌లో సమంత స్పృహ తప్పి పడిపోయింది: వరుణ్ ధావన్

by సూర్య | Tue, Nov 12, 2024, 10:10 PM

స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత తన స్క్రీన్ మీదకొచ్చింది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన సామ్.. తమిళ్, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. మాయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు తిరిగి బిజీ కానుంది. ఇక హిందీలో ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిటాడెల్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తోంది.సమంత ఈ సిరీస్ లో మరోసారి బోల్డ్ గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో మూవీ టీమ్ బిజీగా ఉంది. కాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సామ్ గురించి.. సిటాడెల్ సిరీస్ షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కాగా సినిమా షూటింగ్ లో సమంత స్పృహతప్పి పడిపోయిందని తెలిపాడు వరుణ్. సామ్ పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని వరుణ్ తెలిపాడు.


 


షూటింగ్ లో భాగంగా రెండు గంటల పాటు నటిస్తుండగా సమంత స్పృహతప్పి పడిపోయిందని తెలిపాడు వరుణ్. ఇది చూసిన తనకు కంగారు వచ్చిందని.. వెంటనే ఆమెను లేపి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పాడట. అయితే కొంత సమయం రెస్ట్ తీసుకున్న తర్వాత సామ్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. సామ్ అలా పడిపోగానే అందరం ఆందోళనకు గురయ్యాం.. కానీ కోలుకున్న తర్వాత సామ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంది అని తెలిపాడు వరుణ్. సమంత 2022లో తనకు మైయోసైటిస్ ఉందని ప్రకటించింది. సినిమాలకు దూరమై థెరపీపై దృష్టి పెట్టింది సామ్. చికిత్స సమయంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. కాగా ఇప్పుడు ట్రీట్‌మెంట్ తర్వాత సమంత మళ్లీ నటించడం మొదలుపెట్టింది.

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'మిరాయ్' షూటింగ్ Tue, Dec 10, 2024, 04:59 PM
ఎలైట్ $10 మిలియన్ల క్లబ్‌లో జాయిన్ అయ్యిన 'పుష్ప 2' Tue, Dec 10, 2024, 04:50 PM
అఖండ 2: తాండవం షూట్ ప్రారంభం ఎప్పుడంటే..! Tue, Dec 10, 2024, 04:45 PM
నిరాధారమైన ఊహాగానాలను ఖండించిన ARR కుటుంబం Tue, Dec 10, 2024, 04:37 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర శూరన్' టీజర్ Tue, Dec 10, 2024, 04:27 PM