'SDT 18' ఆన్ బోర్డులో అనన్య నాగళ్ల

by సూర్య | Mon, Nov 11, 2024, 05:34 PM

టాలీవుడ్ నటుడు సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SDT18' అని పిలువబడుతుంది. తేజ్ కొత్త లుక్‌తో ఈ సినిమా కోసం పూర్తి రూపాంతరం చెందాడు. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి జోడిగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ఆన్ బోర్డులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎడిటర్ గా నవీన్ విజయకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ గా అయేషా మరియమ్ ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రంలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించనున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
స్టార్ సింగర్ గీతా: Actor Nandu ప్రపోజల్ కథను పంచుకున్న హృదయస్పర్శి క్షణం Wed, Dec 10, 2025, 10:39 PM
అఖండ 2 టికెట్ ధరల పెంపు ఖరారయిందా? తెలుసుకోండి కొత్త రేట్లు Wed, Dec 10, 2025, 10:11 PM
అఖండ-2: థియేటర్లలో టిక్కెట్ ధరలు భారీగా పెంపు Wed, Dec 10, 2025, 07:19 PM
సత్య హీరోగా కొత్త సినిమా: రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం Wed, Dec 10, 2025, 07:18 PM
ఈటీవీ విన్‌ లో 'కలివి వనం' స్ట్రీమింగ్ Wed, Dec 10, 2025, 04:09 PM