అరుంధతి 2 లో అందాల ఐటెం బాంబ్!

by సూర్య | Fri, Jun 21, 2019, 07:09 PM

స్వీటీ’ అనుష్క లీడ్ రోల్‌లో దివంగత డైరక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. హర్రర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క నట విశ్వరూపం చూపించింది. ‘పశుపతి’ పాత్రలో నటించిన సోనూ సూద్‌ కూడా ఒళ్లు గగుర్పొడిచే రేంజ్‌లో యాక్ట్ చేశాడు. కాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ‘అరుంధతి 2’ తెరకెక్కబోతోంది. శ్రీ శంఖు చ‌క్ర ఫిల్మ్స్‌ ప‌తాకంపై కోటి తూముల ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్ పాయల్ రాజపుత్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఈ మూవీ కోసం ఆమె గుర్రపుస్వారీ, క‌త్తి సాముల‌కు సంబంధించిన శిక్షణ తీసుకుంటోంది.
భారీ బ‌డ్జెట్‌, ఇప్పటి టెక్నాలజీకి తగ్గ రేంజ్ గ్రాఫిక్స్‌తో ఈ మూవీ తీయబోతున్నట్లు నిర్మాత కోటి తూముల చెప్పారు. ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తార‌లు న‌టిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ విజువలైజేష‌న్ గ్రాఫిక‌ల్ వ‌ర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో జ‌రుగుతోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, డైరక్టర్‌తో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివ‌రాలు అధికారికంగా  వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM