పరీక్షలకు ముందు ప్రిపేర్ అయి ఉంటే పెద్ద ఉద్యోగం వచ్చేది: అనుపమ

by సూర్య | Fri, Jun 21, 2019, 04:02 PM

ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. తెలుగమ్మాయి కాకున్నా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. తాను అదృష్టం కొద్దీ సినీ ఇండస్ట్రీకి వచ్చానని, సినిమాలు ఎన్ని చేస్తానో తెలియదని, ఎంతకాలం ఉంటానో కూడా తెలియని కాబట్టి ప్రతి సినిమాను ఆస్వాదిస్తూ పని చేయాలని నిర్ణయించుకున్నట్టు అనుపమ తెలిపింది.


 ఇక సెట్లో తనుండే విధానం, ఒక సన్నివేశానికి ముందు తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ.. సెట్లో తను అడుగు పెట్టేటపుడు తన దృష్టంతా తాను చేయబోయే సన్నివేశంపైనే ఉంటుందని, స్క్రిప్టు పట్టుకుని ఓ పక్కకు వెళ్లి.. ఒక్కో డైలాగ్‌ను రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తానని తెలిపింది. పరీక్షలకు ముందు కూడా ఇలాగే ప్రిపేర్ అయి ఉంటే పెద్ద ఉద్యోగం వచ్చేది కదా అంటూ తన తల్లి తనను ఆటపట్టిస్తుంటుందని ఈ సందర్భంగా అనపమ తెలిపింది. 

Latest News
 
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్ Thu, Apr 25, 2024, 03:13 PM
గురువారం NBK స్పెషల్ సినిమాలు Thu, Apr 25, 2024, 03:10 PM
భారీ బడ్జెట్ తో 'తమ్ముడు' యాక్షన్‌ సీక్వెన్స్‌ Thu, Apr 25, 2024, 03:05 PM
నేడు విడుదల కానున్న 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Thu, Apr 25, 2024, 03:04 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'రత్నం' Thu, Apr 25, 2024, 02:53 PM