తన పై వస్తున్న రుమర్లపై స్పందించిన రెజీనా

by సూర్య | Fri, Jun 21, 2019, 03:52 PM

ప్రముఖ నటి రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. తమిళనాడుకి చెందిన ఓ నేషనల్ మ్యాగజైన్ రెజీనా నిశ్చితార్ధం గురించి వార్తలు ప్రచురించడంతో ఇది కాస్త వైరల్ అయింది.


ఈ నెల 13న చెన్నైలో కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో రెజీనా రహస్యంగా నిశ్చితార్ధం చేసుకుందని రాసుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోబోతుందని అన్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎట్టకేలకు రెజీనా స్పందించింది.ఈ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడ నుండి పుట్టుకొస్తాయో అర్ధం కాదని, ఇలాంటివి విన్నప్పుడు చాలా చిరాకేస్తుందని.. తనకు నిజంగా పెళ్లి ఆలోచన వస్తే స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో 'కసడదబర'తో పాటు తెలుగులో 'ఎవరు' చిత్రంలో నటిస్తోంది. 

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM