1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రోటీ కప్డా రొమాన్స్' ట్రైలర్

by సూర్య | Tue, Nov 05, 2024, 08:15 PM

హర్ష నర్రా, సందీప్ సరోజ్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో యూత్‌ఫుల్ కామెడీ సినిమాని చేస్తున్నారు. ఈ చిత్రానికి 'రోటీ కప్డా రొమాన్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులకు కొత్త సందేశాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు విక్రమ్ రెడ్డి ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల, యువకుల కోసం ఒక ప్రదర్శన నిర్వహించబడింది మరియు వారి అభిప్రాయం మేకర్స్‌కు మరింత నమ్మకం కలిగించింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. 'హుషారు', 'సినిమా చూపిస్త మామ', 'మేం వయసుకు వచ్చాం', 'ప్రేమ ఇష్క్ కాదల్' మరియు 'పాగల్' ఫేమ్ లక్కీ మీడియా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాతో హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ మరియు సృజన్ కుమార్ బొజ్జం నిర్మించారు. 

Latest News
 
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM
నేడు విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ Sat, Mar 14, 2026, 04:23 PM
రెండోసారి తల్లైన నటి పూర్ణ Sat, Mar 14, 2026, 04:22 PM
'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'బూకీ' Sat, Mar 14, 2026, 04:22 PM
అనసూయ పై తప్పుడు పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్ Sat, Mar 14, 2026, 04:19 PM