తెలుగు నేర్చుకుంటున్న శ్రద్ధ కపూర్!

by సూర్య | Thu, Jun 20, 2019, 08:46 PM

శ్రద్ధ కపూర్ ప్రస్తుతం సాహో ఫై దృష్టి మొత్తం పెట్టింది. ఈ సినిమా శ్రద్ధకు సౌత్ లో మొదటిది కావడం తో కచ్చితంగా పెద్ద విజయం సాదించాలి అనే తపన తో పని చేస్తుంది. ఈ సినిమా 15 ఆగస్టు నాడు విడుదల కానుంది. అయితే ఈ సినిమా గురించి అందరి కన్నా ముందు శ్రద్ధ నే ఎక్కువ గా మీడియా తో ముచ్చటిస్తుంది. సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ విషయం లో కూడా శ్రద్ధ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తనకి చాలా స్పెషల్ అని, ఇందులో పోషిస్తున్న పాత్ర చాలా ప్రత్యేకం అని శ్రద్ధ ముందు నుండి చెప్పుకుంటూ వస్తుంది. అయితే తాజాగా శ్రద్ధ తెలుగు లో మరిన్ని సినిమాలు చేయాలనే ఆశ ని వ్యక్త పరిచింది. తెలుగు నేర్చుకుంటున్నట్లు కూడా చెప్పింది. “బాలీవుడ్ తో కంపేర్ చేస్తే తెలుగు లో సినిమాలని తీసే విధానం లో చాలా తేడా ఉంది. ఇక్కడ తెలుగు లో సినిమాలని చాలా త్వరగా నిర్మిస్తున్నారు. నాకు తెలుగు నేర్చుకోవాలనే కోరిక ఎక్కువయింది. షూటింగ్ సమయం లో కొంచెం కొంచెం అలవాటు అయింది. కానీ త్వరలో నే కచ్చితంగా మంచి తెలుగు మాట్లాడతాను” అని చెప్పింది శ్రద్ధ.


 


అయితే ఇప్పటికే తెలుగు లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ శ్రద్ధ ని తెలుగు లో తమ సినిమాలో తీసుకోవాలని అప్రోచ్ అయ్యారట. కాకపోతే ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM