బికినీ వేసిన డాక్టర్‌!

by సూర్య | Thu, Jun 20, 2019, 07:44 PM

తన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ డాక్టర్‌కు మయన్మార్ దేశ మెడికల్ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా ఆమె మెడికల్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మోడల్ అవ్వాలని అనుకున్న 29 ఏళ్ళ నాంగ్ మ్యూ సాన్ చివరికి డాక్టర్‌గా సెటిల్ కావాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా ఆమె డాక్టర్‌గా రోగులకు సేవ చేసింది. అయితే ఈ ఏడాది ఆమె కొన్ని మోడలింగ్ ఫోటో షూట్స్ లో పాల్గొని.. బికినీ వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవి చూసిన మయన్మార్ మెడికల్ కౌన్సిల్ ఆమెను హెచ్చరించి.. ఆ ఫోటోలను తొలగించాలని చెప్పింది. డాక్టర్‌గా ఉంటూ ఇలాంటి పనులు చేయవద్దని కూడా సూచనలు ఇచ్చింది. అయితే ఆమె మాత్రం మెడికల్ కౌన్సిల్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. మరిన్ని బికినీ ఫోటో షూట్స్ చేయడంతో తాజాగా మెడికల్ కౌన్సిల్.. ఆమె లైసెన్స్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా సాన్ స్పందిస్తూ ‘మహిళల దుస్తులు కూడా ఎలా ధరించాలో నిర్ణయించే అధికారం మయన్మార్ మెడికల్ కౌన్సిల్‌కు లేదని.. ఇది దేశ సంస్కృతి సంప్రదాయాలకు విరుద్దమంటూ’ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక ఇప్పుడు ఈ విషయం ఆ దేశంలో పెద్ద చర్చకు దారి తీసింది.


 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM