భారీ పారితోషికాన్ని తీసుకుంటున్న హీరోయిన్‌

by సూర్య | Thu, Jun 20, 2019, 06:20 PM

బాలీవుడ్‌ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాల గురించి తెలిస్తే షాక్‌ అవడం గ్యారంటీ. ఐదు, పది కోట్ల రేంజ్‌ దాటేశారు. ఇప్పుడు 15 కోట్లు డిమాండ్‌ చేస్తున్నారు. హీరోల స్థాయిలో అందుకుంటున్నారు. భారతీయ క్రికెట్‌ చరిత్రలో 1983 సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. ఆ ఏడాది భారతీయ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలుచుకుంది. ఆనాటి క్రికెటర్లు ఎలా పోరాడి గెలిచారు, నాటి పరిస్థితుల ఆధారంగా 83 పేరుతో సీన్మా రూపొందుతోంది. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఆయన భార్య రోమీ భాటియాగా దీపిక పదుకోన్‌ నటిస్తోంది. ఇటీవలే పెళ్లిచేసుకున్న రణ్‌వీర్‌, దీపికా కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో సినిమాకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో దీపికా భారీ నజరానా అడిగనట్టు ప్రచారం జరుగుతోంది. సుమారు 15 కోట్లు తీసుకుంటున్నట్టు వినికిడి.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM