by సూర్య | Sun, Nov 03, 2024, 04:24 PM
పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సమంత ఒకరు. ఎన్నో హిట్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంది.చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించిన సామ్.. కొన్ని నెలలుగా మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మీడియ ముందుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ. చాలా రోజులుగా లకు దూరంగా ఉంటుంది సామ్. కానీ అంతకు ముందు ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో బీటౌన్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
గతంలో ఓ మీడియకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇక పై మీరు స్పెషల్ సాంగ్స్ చేస్తారా ? అని అడగ్గా.. చెయ్యనని చెప్పింది. అలాగే మీరు సింగిల్ గా ఉండాలని అనుకుంటున్నారా అంటే లేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. అంటే ఇకపై సామ్ స్పెషల్ సాంగ్స్ చేయనని.. అలాగే సింగిల్ కాకుండా మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పిందంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మావ ఊహు అంటావ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు పుష్ప 2లోనూ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. అందులో సమంతతోపాటు మరో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించనుందంటూ టాక్ వినిపిస్తుంది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
Latest News