కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి దర్శించుకున్న కిరణ్ అబ్బవరం

by సూర్య | Sun, Nov 03, 2024, 04:17 PM

కిరణ్ అబ్బవరం హీరోగా చిన్న సినిమాగా వచ్చిన 'క' ఇప్పుడు పెద్ద సక్సెస్ అందుకుంది. ఆ చిత్ర బృందం ఇప్పుడు విజయోత్సాహంతో ఉంది. తాజాగా 'క' టీమ్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంది. 'క' చిత్రం పీరియాడిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి సుజీత్-సందీప్ దర్శకత్వం వహించారు. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి రోజు రూ.6 కోట్ల మేర వసూళ్లతో ఔరా అనిపించింది. వీకెండ్ లోనూ ఆశాజనకరీతిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా సోమవారం నాటికి బ్రేక్ ఈవెన్ కు వస్తుందని, అక్కడ్నించి వసూలయ్యే ప్రతి రూపాయి లాభమేనని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి వేళ దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్', శివకార్తికేయన్ 'అమరన్' చిత్రాలు కూడా వచ్చినప్పటికీ, వాటి నుంచి పోటీ తట్టుకుని 'క' విజయవంతం కావడం విశేషం.


 


 

Latest News
 
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM
మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట.. ఎందుకో తెలుసా ? Sun, Dec 01, 2024, 06:40 PM
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి? Sun, Dec 01, 2024, 06:36 PM
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి Sun, Dec 01, 2024, 06:34 PM