కాబోయే అత్తగారి ఇంట్లో శోభితా దీపావళి సెలబ్రెషన్స్ ?

by సూర్య | Sun, Nov 03, 2024, 02:07 PM

 గత కొన్ని రోజులుగా బాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతోంది. అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉన్నరంటూ ప్రచారం జరిగింది.అయితే.. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ.. ఇరు కుటుంబాలు వీరి ఎంగేజ్ మెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. వీరికి సంబంధించి ఏ విషయమైన నెట్టింట ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజా శోభితా సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతోంది. ఇంతకీ ఆ విషయమేంటో మీరు లూక్కేయండి?హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల గత కొద్ది నెలలుగా వార్తల్లో నిలుస్తుంది. అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత కొద్దీ రోజులకే స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ పుకార్లు వచ్చాయి. ఓ సారి జంట మీడియా కంటపడటంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూర్చినట్టు అయింది. అయితే.. ఈ రూమార్స్ పై ఎలాంటి క్లారిటీ రాకముందే.. ఆగస్ట్ 8 న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చారు.


ఇక అప్పటి నుంచి ఈ జంట సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఇటీవల నటసామ్రాట్‌ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం 2024 (ANR National Awards 2024)వేడుకలో అక్కినేని చైతన్య- శోభితాలు సందడి చేశారు. ఈవెంట్లో శోభిత ట్రెడిషనల్ లుక్ లో అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఈ ఈవెంట్ లో నాగచైతన్య శోభితల జంట సెంటర్ ఆఫ్ అట్రాక్టన్ గా నిలిచింది. ఈ వేడుకలో తనకు కాబోయే కోడలిని చిరంజీవికి కూడా పరిచయం చేశాడు నాగార్జున. ఆ ఫంక్షన్ లో శోభిత అక్కినేని కుటుంబ సభ్యురాలిగానే మారిపోయింది.


అదే సమయంలోనే నాగ చైతన్య- శోభితల పెళ్లి ప్రస్తావన వచ్చినట్టు టాక్. వీరు ఈ ఏడాది చివర్లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. నాగచైతన్య, శోభితల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని, డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ నాలుగవ తేదీన పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. డిసెంబర్ 10 న డిన్నర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఈ జంట తరుచు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.


ఇదెలా ఉంటే.. తాజాగా ఈ క్రమంలో వీరికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత రెండు రోజుల క్రితం.. దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో శోభిత కూడా దీపావళిని చాలా గ్రాండ్ సెలబ్రెట్ చేసుకుంది. అయితే..ఈ సారి చాలా స్పెషల్ గా తన కాబోయే అత్తగారి ఇంట్లో.. అక్కినేని కుటుంబసభ్యులతో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం అత్తమామలు నాగార్జున- అమల, కాబోయే భర్త నాగ చైతన్య, మరిది అఖిల్ తో డిన్నర్‌కు వెళ్లారు. ఈ సెలబ్రెషన్స్ సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే.. ఈ ఫోటోను అక్కినేని కుటుంబ సభ్యులు కాకుండా వారి డిన్నర్ ప్రిపేర్ చేసిన రెస్టారెంట్ చెఫ్ షేర్ చేశారు. ఇందులో దీంతో శోభిత సీక్రెట్ సెలబ్రెషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Latest News
 
సన్నిలియోన్ అభిమానులకు షాక్ ఇచ్చిన పోలీసులు Sun, Dec 01, 2024, 06:48 PM
టేస్టీ తేజ బిగ్ బాస్ రెమ్యూనరేషన్! Sun, Dec 01, 2024, 06:46 PM
మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట.. ఎందుకో తెలుసా ? Sun, Dec 01, 2024, 06:40 PM
ఏపీలో ‘పుష్ప 2’ టికెట్ రేట్ల పరిస్థితేంటి? Sun, Dec 01, 2024, 06:36 PM
అది చూసి ఎంతో బాధపడ్డాను: సాయి పల్లవి Sun, Dec 01, 2024, 06:34 PM