by సూర్య | Sat, Nov 02, 2024, 08:15 PM
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క (KA). ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు.ఈ మూవీని దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు.శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైన 'క' సినిమా ఎన్ని కోట్ల వసూల్లు రాబట్టింది? రెండవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన 'క' మూవీలో తన్వి రామ్, అచ్యుత్ రామ్, రెడిన్ కింగ్స్ లీ.. లీడ్ రోల్స్ నటించారు. 'క' అనే ఒకే అక్షరాన్ని టైటిల్ పెట్టి.. విడుదలకు ముందు నుంచే హైప్స్ క్రియేట్ చేశారు. క మూవీ కథ విషయానికి వస్తే.. ఈ సోర్టీ 1977లో సాగుతోంది. హీరో కిరణ్ అబ్బవరం ..అభినయ వాసుదేవ్ అనే పాత్రను నటించారు. అభినయ వాసుదేవ్ ఓ అనాథ. తన బాల్యం మొత్తం ఓ అనాథాశ్రమంలో సాగుతోంది. అయితే.. అతనికి వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంది.
ఆ ఆసక్తితోనే పెద్దయ్యాక క్రిష్ణగిరి అనే ఓ మారుమూల గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా కూడా చేరతాడు. ఈ క్రమంలో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ హెడ్ గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామ(నయన్ సారిక)తో పరిచయం ఏర్పాడుతోంది. ఇలా కథ చాలా హ్యాపీగా.. సాగిపోతున్నా.. తరుణంలో ఆ ఊళ్ళో అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. వేరే వాళ్ల లెటర్స్ చదివే వాసుదేవ్ కి ఓ ఉత్తరం ద్వారా అమ్మాయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఓ క్లూ దొరుకుతోంది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఎలా చేదిస్తాడు? ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు?అనేది 'క'మూవీ.
ఎన్నో రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తన కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు. వరుస ఫ్లాఫ్స్ తరువాత దీపావళీ పండుగ కానుకగా విడుదలైన క (KA) మూవీ ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీగా మారింది. ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో.. కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇతర సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య, ప్రీ బుకింగ్స్ కూడా చాలా తక్కువే. అయినా.. మంచి టాక్, మౌత్ టాక్ రావడంతో షోలు పెరిగాయి. భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. క మూవీ తొలి రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేయగా.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ ల్లో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఇలా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు మేకర్స్.
క సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు కిరణ్ అబ్బవరం. క మూవీ రెండవ రోజు కలెక్షన్ల కూడా దుమ్మురేపాయి. శుక్రవారం కూడా క మూవీ హవా కొనసాగింది. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. తెలుగు (2D) థియేటర్ ఆక్యుపెన్సీ చూస్తే.. మార్నింగ్ షో 43.82 శాతం, మధ్యాహ్నం షో 62.82 శాతం, సాయంత్రం షో 70.53 శాతం, నైట్ షో 78.27 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ఇలా తొలి రోజు 'క' మూవీ ఓవరాల్ గా 63.86 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. ఇలా క మూవీ రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 3 కోట్ల కలెక్షన్లు అందుకుంది. ఇలా కేవలం రెండు రోజుల్లో రూ. 6.80 కోట్లు కలెక్షన్లను (ఇండియన్ బాక్సాఫీస్) సాధించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా క మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే.. రూ. 9.25 కోట్ల నుండి రూ 10.25 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. క మూవీ మూడో రోజు కలెక్షన్లు కూడా దుమ్మురేపే అవకాశముంది. ఇప్పటికే ఊహించని విధంగా అడ్వాన్స్ బుక్సింగ్, వరుసగా హలీడేస్ రావడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రెడర్స్ అంచనా వేస్తున్నారు. గత కొంతకాలంగా హీరో కిరణ్ సరైన హిట్ అందుకోలేక ఇబ్బంది పడుతున్న కిరణ్ అబ్బవరం 'క' సినిమా ద్వారా కమ్ బ్యాక్ అవుతారని భావిస్తున్నారు ఫ్యాన్స్.
Latest News