by సూర్య | Sat, Nov 02, 2024, 07:20 PM
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "దేవర పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులను నెలకొల్పింది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఆకట్టుకునే వసూళ్లను సాధించింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 8న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రానున్న రోజులలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ, ప్రేక్ష రాజ్, అజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందించారు.
Latest News